*ప్రచురణార్థం—-*1
తేదీ: 29-05-2023
ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి :: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
జయశంకర్ భూపాలపల్లి, మే : 29
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
సోమవారం జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 36 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ పాల్గొన్నారు
…………………………………………….
జిల్లా పౌర సంబంధాల అధికారి జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.