ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదుల ను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో డి ఆర్ డి ఓ వెంకట మాధవరావు, కలెక్టరేట్ ఏవో రవీందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. —————— జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.