జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్
ప్రజావాణి లో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధికారులు కృషిచేసి అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 35 దరఖాస్తులు రాగా వాటిలో ధరణి భూ సమస్యలు వృద్ధప్య పింఛన్లు స్వయం ఉపాధి వంటి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ వై వి గణేష్ డిఆర్ఓ రమాదేవితో కలిసి స్వీకరించారు.
ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు ఎండార్స్ చేసి సిఫారసు చేశారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యత ఇస్తూ వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు.
ప్రజావాణి కార్యక్రమంలో డిపిఓ వెంకయ్య సిపిఓ ప్రకాష్ జెడ్పి సీఈఓ ప్రసన్నరాణి డిఏఓ గౌస్ హైదర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులా రవి సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.