ప్రజావాణిలో వినతులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి,

ప్రజావాణిలో వినతులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి,
ప్రజావాణిలో వినతులు స్వీకరించిన జిల్లా అదనపు(అర్బన్) కలెక్టర్ అభిషేక్ అగస్త్య,
ప్రజావాణిలో 77 వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్లు,
జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చే వినతులు, విజ్ఞప్తులు, సమస్యలను వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు అన్ని రకలుగా వినతులకు స్పందించాలని అప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య అన్నారు. సోమవారం శామీర్పేటలోని కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన 77 వినతులు, ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు వాటి పరిష్కారానికి ప్రాదాన్యతను ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post