ప్రజావాణిలో వినతులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు, ప్రజావాణి వినతులు స్వీకరించిన జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్,

పత్రిక ప్రకటన

తేదీ : 07–11–2022

ప్రజావాణిలో వినతులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు,
ప్రజావాణి వినతులు స్వీకరించిన జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్,
జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో 42 వినతులు స్వీకరించిన అధికారులు,
సోమవారం శామీర్పేటలోని కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణితో కలిసి జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన 42 వినతులు, ఫిర్యాదులు, విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించి ప్రజల ఇబ్బందులు తీర్చాల్సిన బాధ్యత ఉందని దీనిని దృష్టిలో పెట్టుకొని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post