* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి సెప్టెంబర్ 13 ( సోమవారం).
ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలు అందించిన దరఖాస్తులను అర్హత మేరకు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ కురాకుల స్వర్ణలత తెలిపారు
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన దరఖాస్తులను జెసి స్వీకరించి సత్వర పరిష్కారం దిశగా సంబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేశారు. ఈ ప్రజావాణిలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల మేరకే ప్రజా వాణి నిర్వహించబడుతుంది అని ప్రతి సోమవారం వివిధ సమస్యలపై నిరభ్యంతరంగా తమ సమస్యలను విన్నవించు కో వచ్చునని తక్షణ పరిష్కారం దిశగా సంబంధిత అధికారులు ఎండార్స్మెంట్ చేసి వారి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్నారు
డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.