ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ స్వీకరించారు.
ఈ సందర్బంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రజావాణిలో దరఖాస్తు చేస్తే సమస్య త్వరగా పరిష్కారం అవుతుందనే నమ్మకంతో ప్రజలు ప్రజావాణికి వచ్చి తమ సమస్యలను ఫిర్యాదు రూపంలో ఇస్తారని, ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో తిరస్కరణకు గల కారణాలను వివరంగా తెలుపుతూ అర్జిదారునికి అందజేయాలని సూచించారు. శాఖల వారిగా వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ రోజు ప్రజావాణి ద్వారా వివిధ సమస్యలపై 120 దరఖాస్తులు రావడం జరిగిందన్నారు.
ఈ ప్రజావాణిలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.