ప్రజావాణిలో సమస్యలు సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజావాణిలో వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్

 

పత్రిక ప్రకటన

తేదీ : 05–09–2022

ప్రజావాణిలో సమస్యలు సత్వరమే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజావాణిలో వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్
జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో 43 వినతుల స్వీకరణ
ప్రజావాణిలో ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు సిద్దంగా ఉండాలని అన్ని శాఖల అధికారులు ప్రజావాణికి తప్పకుండా హాజరు కావాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్ అన్నారు. సోమవారం షామీర్పేట కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ జిల్లాలోని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మకంతో ఎంతో దూరం నుంచి వ్యయప్రయాసాలకోర్చి వస్తుంటారని ఈ విషయంలో అధికారులు సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించేలా సిద్దంగా ఉండాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రజావాణిలో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ప్రజలు అందించిన విజ్ఞప్తులను ఏమాత్రం పెండింగ్లో ఉంచకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 43 వచ్చిన మొత్తం వినతులు, ఫిర్యాదులను వారు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post