ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియఅన్నారు.

సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా వివిధ సమస్యల పై పిర్యాదులను సమర్పించడానికి వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ జిల్లా అధికారులు శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ అంశాలపై 90 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post