ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్

 

క్షేత్ర స్థాయిలో డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్

————–

వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైడే కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుండి జిల్లా అదనపు కలెక్టర్ అర్జీలు, వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా గ్రామాల్లో చేపట్టాలని సూచించారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం క్రమం తప్పకుండా డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని అన్నారు.

మండల ప్రత్యేక ఆధికారులు, పంచాయితీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఐ.కె.పి., మెప్మా, ఏఎన్ఎం లు కలిసి గ్రామాల్లో డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. ప్రతీ ఇంటింటికీ తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. మురుగు నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వేయించాలని, ఫాగింగ్ మెషీన్లతో స్ప్రే చేయించాలని అన్నారు.

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న కోర్టు కేసుల వివరాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అన్నారు.

సోమవారం ప్రజావాణిలో ప్రజల నుండి మొత్తం 44 అర్జీలు వచ్చాయి.

ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ వి.లీల, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

——————————————-

Share This Post