ప్రజావాణి అర్జీలకు సత్వరమే పరిష్కారం చూపాలి : జిల్లా అదనపు కలెక్టర్ లు బి. సత్య ప్రసాద్, ఎన్. ఖిమ్యా నాయక్

ప్రజావాణి అర్జీలకు సత్వరమే పరిష్కారం చూపాలి : జిల్లా అదనపు కలెక్టర్ లు బి. సత్య ప్రసాద్, ఎన్. ఖిమ్యా నాయక్
——————————————-

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ లు బి. సత్య ప్రసాద్, ఎన్. ఖిమ్యా నాయక్ లు సంబంధిత అధికారులను ఆదేశించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుండి అర్జీలను, ఫిర్యాదులు స్వీకరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ప్రజావాణి లో వచ్చిన ఆర్జీల పై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారం చూపాలని సూచించారు.
పెండింగ్ అర్జీల పై మండల స్థాయి అధికారులతో సమీక్ష చేసి వచ్చే సోమవారం లోగా అన్నింటికీ పరిష్కరించాలని చెప్పారు.
దరఖాస్తుల పరిష్కారం ప్రగతిపై అర్జీదారులకు లిఖిత పూర్వక సమాచారం ఇవ్వాలన్నారు.

కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 19 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి.

Revenue – 6
Employment – 2
Mc, Srcl – 7
Mc, vemulawada – 1
DM RTC, Srcl – 1
DPO – 1
MPDO, chandurthi – 1

Total – 19

కార్యక్రమంలో ఇంచార్జి డి.ఆర్.ఓ టి. శ్రీనివాస్ , ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.

 

 

Share This Post