ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ రెడ్డి

– అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు విధిగా ప్రజావాణి హాజరు కావాలి


ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖ అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని
జిల్లా కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ రెడ్డి అన్నారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీల స్వీకరణ అనంతరం మాట్లాడారు.

రెవెన్యూ మినహా గత ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు పరిష్కారం కోసం అర్జీలు వస్తున్నందున వాటిని క్షేత్రస్థాయిలో విచారించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు అధికారులు అందరూ విధిగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి తప్పక హాజరు కావాలని కలెక్టర్ మరోమారు స్పష్టం చేశారు. ధరణీ కి వచ్చే అర్జీలను వెనువెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులకు సూచించారు.

భూ సంబంధిత సమస్యలు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 37 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి.
ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు పంపించి సత్వర పరిష్కారం చేయాల్సిందిగా సూచించారు.

ప్రజావాణి లో
జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి చెన్నయ్య,RDO లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post