ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

ప్రజావాణికి 55 దరఖాస్తులు

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అదనపు కలెక్టర్లు రాజార్షి షా, వీరారెడ్డి లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా అధికారులు తమ శాఖకు వచ్చిన అర్జీలను పరిశీలన చేసి పెండింగ్ లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఆర్జి దారులు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా, తమ పరిధిలో పరిష్కరించ
గలిగినదైతే పరిష్కరించాలని లేనట్లయితే, వారికి పరిష్కారం కాకపోవడానికి గల కారణాన్ని వివరించాలని తెలిపారు.

ప్రజావాణిలో మొత్తం (55) దరఖాస్తులు రాగా, రెవెన్యూ శాఖకు సంబంధించి (30), ఇతర శాఖలకు చెందినవి (25) దరఖాస్తులు వచ్చాయి.

భూ సమస్యలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పింఛన్లు,తదితర సమస్యలపై ఆర్జీలు అందాయి.

ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజార్షి షా, వీరారెడ్డి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ ఓ,తదితరులు పాల్గొన్నారు.

Share This Post