ప్రజావాణి అర్జీలను పరిశీలించి చర్యలు చేపడతాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 20, 2021ఆదిలాబాదు:-

ప్రజలకు సంబందించిన సమస్యలు పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ సమస్యలు, విద్య, వైద్యం, ఉపాధి, రెండుపడక గదుల ఇళ్ల మంజూరు, కళ్యాణలక్ష్మి, తదితర సమస్యలపై అర్జీలు వచ్చాయని తెలిపారు. ప్రజావాణిలో సమర్పించిన అర్జీలను పరిశీలించి తన పరిధిలోని వాటిపై చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వానికి సంబంధించిన వాటికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్ రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post