ప్రజావాణి అర్జీలను పరిష్కరించండి- ఆర్డీఓ రాజేశ్వర్.

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని రాజస్వ మండల అధికారి జాడి రాజేశ్వర్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ ప్రజావాణిలో భూ సమస్యలు, ఫించన్ ల మంజూరు, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు, ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై అర్జీలు ఆయన స్వీకరించి  సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. ఆయా అధికారులు అర్జీలను పరిశీలించి సాధ్యాసాధ్యాల ఆధారంగా సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రజావాణిలో LDM చంద్రశేఖర్, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ పద్మభూషణ్ రాజు, కలెక్టరేట్ పర్యవేక్షకులు స్వాతి, నలంద ప్రియా, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post