*ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి*
*జిల్లా అదనపు కలెక్టర్ లు శ్రీ బి సత్య ప్రసాద్, శ్రీ ఖిమ్యా నాయక్*
——————————
ప్రజావాణిలో వచ్చి న దరఖాస్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని *జిల్లా అదనపు కలెక్టర్ లు శ్రీ బి సత్య ప్రసాద్, శ్రీ ఖిమ్యా నాయక్* లు అధికారులను ఆదేశించారు.
జిల్లా కేంద్రంలోని IDOC మీటింగ్ హల్ నందు సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలోప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ…
ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు.
పెండింగ్ అర్జీల పై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మిషన్ మోడ్ లో అన్నింటినీ పరిష్కరించాలని అన్నారు.
ప్రజావాణి లో భూ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే ఫిర్యాదులు, వినతుల పై
రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. వీటితో పాటు భూ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ధరణి కి వచ్చే దరఖాస్తుల పరిష్కారం పై ప్రత్యేక శ్రద్ద పెట్టీ పరిష్కారం చూపాలన్నారు.
జిల్లాలో వేసవి దృష్ట్యా ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నందున వడ దెబ్బ నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కలిపించాలని వైద్య, పంచాయతీ అధికారులను ఆదేశించారు.
కాగా సోమవారం భూ సంబంధిత సమస్యలు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 15 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి.
ప్రజావాణి లో ఆర్డీఓ శ్రీనివాస్ రావు
, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
( Attached: శాఖ వారీగా ఫిర్యాదులు, వినతుల జాబితా)
Revenue – 8
Dcso – 1
MC sircilla – 5
MC vmwd- 1
Total – 15
——————————