ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖిమ్యా నాయక్

 

*ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి : అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్*

——————————

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ ఆదేశించారు.

జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండింగ్ అర్జీలపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మిషన్ మోడ్ లో అన్నింటినీ పరిష్కరించాలని అన్నారు.

ప్రజావాణిలో భూ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే ఫిర్యాదులు, వినతుల పై
రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. వీటితో పాటు భూ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ధరణి కి వచ్చే దరఖాస్తుల పరిష్కారం పై ప్రత్యేక శ్రద్ద పెట్టీ పరిష్కారం చూపాలన్నారు.

కాగా సోమవారం భూ సంబంధిత సమస్యలు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం ఫిర్యాదులు, వినతులు వచ్చాయి.

Revenue 7
MC srcl 2
Dmho 1
Irrigation 1
Dcso 1

ప్రజావాణి లో ఇంచార్జి డీఆర్ఓ శ్రీనివాస్ రావు, వేములవాడ ఆర్డీఓ వి.లీల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
——————————

Share This Post