DPRO ADB-ప్రజావాణి అర్జీలపై చర్యలు చేపట్టండి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రజల విజ్ఞప్తులను పరిశీలించి ఆయా శాఖల ద్వారా చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుండి విజ్ఞాపనలను కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీఓ లు స్వీకరించారు. భూ సమస్యలపై, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు, పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, దళిత అభివృద్ధి శాఖ నుండి రుణాలు మంజూరు పై ఆయా అర్జీదారులు గ్రామసమస్యలు, వ్యక్తిగత సమస్యలపై దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హత కలిగిన వారందరికీ రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని, ఉపాధ్యాయులను నియమించడానికి, గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు స్వాతి, నలంద ప్రియా, తదితరులు పాల్గొన్నారు.

Share This Post