ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య

ప్రెస్ రిలీజ్

జనగాం జిల్లా , జనవరి 23

ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య

సోమవారం నాడు అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య నిర్వహించారు,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు చేసుకున్న ఆర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని వారి పరిధిలో లేకుంటే ఆర్జీదారులకు సమస్యల పరిష్కారం కోసం సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా సంబంధిత జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు,

ఈ సోమవారం నాడు అధిక శాతం (40) ఆర్జీలు రెవెన్యూ శాఖకు సంబంధించినవి భూ సమస్యలు పరిష్కారం కోసం చేసుకున్నట్లు తెలిపారు, ఇతర అన్ని విభాగాల కలిపి 64 ఆర్జీలు వచ్చాయని వాటిని సాధ్యమైనంత తొందరగా పరిశీలించి పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య తెలిపారు.

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా గతంలో వచ్చిన దరఖాస్తుల స్థితిగతులను శాఖల వారీగా ఎన్ని పరిష్కరించారు ఎన్ని పెండింగ్లో ఉన్నాయే వాటిపై సమీక్ష నిర్వహించారు, త్వరగా పరిష్కరించాలన్నారు,

జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లాలో యువ ఓటర్లు అవగాహన కల్పించడం కోసం రేపు అనగా జనవరి 25వ తేదీన ర్యాలీలు, సాంస్కృతిక, కార్యక్రమాలు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో జిల్లా అధికారులు భాగస్వాములై ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు,

ఈ ప్రజావాణి కార్యక్రమంలో రెవిన్యూ డివిజన్ అధికారులు మధుమోహన్, కృష్ణవేణి, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.రామ్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ .మహేందర్, ఎన్పిడిసీఎల్ ఎస్ ఈ వేణుమాధవ్, డిపిఓ వసంత, సిపిఓ ఇస్మాయిల్, డిఎఓ వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రజిత,డిఎస్ఓ రోజా రాణి, డిఎం సంధ్యారాణి, జిల్లా అధికారులు అన్ని శాఖల విభాగాల సిబ్బంది కలెక్టరేట్ పరిపాలన అధికారి మన్సూరి, ఏతేషామ్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

Share This Post