ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన పిర్యాదులు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లు చెప్పారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను కూలంకషంగా పరిశీలన చేసిన తదుపరి పిర్యాదుదారునికి లిఖిత పూర్వక సమాదానం తెలియచేయాలని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన పిర్యాదులు కొన్ని::

 

కొత్తగూడెం మండలం, నేతాజి మార్కెట్ ప్రాంతానికి చెందిన జి. దుర్గాప్రసాద్ నేతాజి మార్కెట్ రెండవ లైనులో ఖాళీ ఇంటిస్థలం లో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయని, స్థల చుట్టు ప్రక్కల ఉన్న ఇంటి యజమానులు అనేక ఇబ్బందులు పడుతున్నామని పరిశుభ్రం చేయించు విధంగా చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం మున్సిపల్ కమిషనర్క ఎండార్స్ చేశారు.

 

చండ్రుగొండ మంలం, అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన ఎస్కే జానిమియా దివ్యాంగుల పించను కొరకు లైన్లైన్ చేసియున్నానని, రెండు సంవత్సరాలైన నేటి వరకు పింఛను మంజూరు చేయలేదని చేసిన పిర్యాదును పరిశీలించిన అదనపు కలెక్టర్ ప్రభుత్వ పరిధిలో పెండింగ్లో ఉన్నదని, ప్రభుత్వం మంజూరు చేసిన తదుపరి పింఛను మంజూరు చేయడం జరుగుతుందని చెప్పారు.

 

ఇల్లందు మండలం, రేపల్లెవాడ గ్రామానికి చెందిన చండ్ర శ్రీహరి మామిడి గుండాల గ్రామం సర్వే నెం.1లో తనకు 5 ఎకరాల భూమి కలదని, తనకు ఆర్ఎఎస్ఆర్ హక్కు పత్రాలున్నాయని, కావున సంబంధిత రికార్డులు పరిశీలించి పట్టాదారు పాసుపుస్తకాలు, రైతుబంధు మంజూరు చేయించాల్సిందిగా చేసిన దరఖాస్తులను పరిశీలన నిమిత్తం ధరణి కో ఆర్డినేటర్కు ఎండార్స్ చేసినట్లు చెప్పారు.

 

పాల్వంచ మండలం, పాయకారుయానంబైలు గ్రామానికి చెందిన తాటి వెంకటేశ్వరావు, జక్కుల వీరబద్రం కెటిపిఎస్ యాస్ పాండ్ నిర్మాణంలో కొంత భూమి పోగా ఉన్న భూమికి వెళ్లడానికి రహదారి సౌకర్యం కల్పించాలని దరఖాస్తు చేయగా తగు చర్యలు నిమిత్తం కేటిపిఎస్ ఎస్ఈకి ఎండార్స్ చేశారు.

 

మణుగూరు మండలం, సుందరయ్య నగర్ గ్రామానికి చెందిన షేక్ మీరాహుస్సేన్ బిటిపిఎస్ నిర్మాణం నందు 3.28 ఎకరాల సాగుభూమిని కోల్పోయామని, తనకు పరిహారం కానీ తనకు కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించాలని చేసిన దరఖాస్తును పరిహారం చెల్లింపు నిమిత్తం తగు చర్యలు తీసుకోవాలని భూ సేకరణ విభాగపు అధికారులను ఆదేశించారు.

 

చుంచుపల్లి మండలం, గ్రామానికి చెందిన ధరావత్ బాలి కొన్ని సంవత్సరాల నుండి వెంకటేశ్వరస్వామికి సేవ చేస్తున్నానని, గుడికి వెళ్లడానికి రహదారి సౌకర్యం లేక బక్తులు ఇబ్బందులు పడుతున్నారని, రహదారి సౌకర్యం కల్పించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం దేవాదాయశాఖ అధికారులకు ఎండార్స్ చేశారు.

 

జూలూరుపాడు మండలం, గ్రామానికి చెందిన బడుగు ఆదిలక్ష్మి, వాడేపల్లి లాలమ్మ, వేమూరి విక్టోరియా తమ తల్లిదండ్రులు పసుపు కుంకుమ క్రింద ఒక్కొక్కరికి 20 కుంటల భూమి ఇచ్చారని, సేద్యం చేస్తున్న మమ్ములను తమ అన్న ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఎస్టీని నుండి ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉందని, కావున తమకు న్యాయం చేయాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం తహసిల్దార్కు ఎండార్స్ చేశారు.

 

Share This Post