ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో మాదిరిగానే మండల స్థాయిలో కూడా ప్రతి సోమవారం ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ మండల అధికారులను ఆదేశించారు.

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు .

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో తహసిల్దారులు, ఎంపీడీవోలు ప్రజల వద్దనుండీ పిర్యాదులను స్వీకరించడమే కాకుండా వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. మండల స్థాయిలో అధికారులు ప్రతి ఫిర్యాదును స్వీకరించినట్లయితే జిల్లా కేంద్రానికి వచ్చే పిర్యాదుదారుల సంఖ్య తగ్గుతుందని, దీనివల్ల వారికి సమయం ఆదాఆవటమే కాకుండా, ఖర్చు తగ్గుతుందని తెలిపారు.

ఈ సోమవారం 76 ఫిర్యాదులు రాగా, వాటిలో భూములకు సంబంధించినవి, ఉద్యోగం ,ఉపాధి తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి.

రెవెన్యూ అదనపు కలెక్టర్
కె. సీతారామారావు, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, ఆర్డీవో అనిల్ కుమార్ ,డి ఆర్ డి ఓ యాదయ్య ,జెడ్పి సీఈవో జ్యోతి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

Share This Post