ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చేసిన ప్రజల నుండి వారి సమస్యలపై 288 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేసి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post