ప్రజావాణి కార్యక్రమం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.    తేది:08.08.2022, వనపర్తి.

ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన  ఫిర్యాదులను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు ఆదేశించారు.
సోమవారం ఐ డి ఓ సి. ప్రజావాణి సమావేశ మందిరంలో ఆమె ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి దరఖాస్తుదారుల ద్వారా అందిన ఫిర్యాదులను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా దరఖాస్తుదారుల నుండి (8) ఫిర్యాదులను ఆమె స్వీకరించారు.
అనంతరం దూర విద్య ద్వారా ఎస్.ఎస్.సి, ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించేందుకు గాను తెలంగాణ ఓపెన్ స్కూల్ (TOSS) ప్రాస్పెక్టస్ & అప్లికేషన్ ఫారం 2022-23 సం. పుస్తకాన్ని డి.ఈ.ఓ. రవీందర్ తో కలిసి ఆమె ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post