ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు అధికారులకు సూచించారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా తమ సమస్యలు తెలపడానికి వచ్చిన వారి దగ్గర నుంచి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియతో కలిసి దరఖాస్తులను స్వీకరించారు.
ప్రజావాణికి వివిధ మండలాల నుండి వచ్చిన దరఖాస్తుదారుల సమస్యలను విన్నారు. సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యదులను జాప్యం లేకుండా సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ప్రజావాణిలో వివిధ అంశాలపై 75 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.