ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య

ప్రెస్ రిలీజ్

జనగాం జిల్లా,   జనవరి 30

ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించాలి  జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య

ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి నిర్వహించారు,

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఆర్జీలు చేసుకున్న ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు అధికారులు కృషి చేయాలని శాఖల వారీగా పెండింగు దరఖాస్తులను వెంటనే పరిష్కారం చేయాలని అన్నారు,

ఈ సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో ఎడి సర్వే ల్యాండ్ 3, డిస్టిక్ సివిల్ సప్లై 1, డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ 4, ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 5, హ్యాండ్లూమ్స్ 1, మున్సిపల్ 1, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భూ సేకరణ 1, జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ శాఖకు సంబంధించినవి 39 కాగ  మొత్తం కలిపి (55) దరఖాస్తులు ఈరోజు ప్రజావాణిలో వచ్చాయని జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య తెలిపారు, ఈ దరఖాస్తులను పరిశీలించి వారికి సూచనలు పరిష్కారము కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని వెంటనే పరిష్కరిస్తామని ఆయన అన్నారు,

అంతకుముందు ప్రభుత్వ ఆదేశానుసారం చనిపోయిన స్వతంత్ర సమరయోధుల ఆత్మలకు శాంతి కలగాలని జిల్లా అధికారులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు,

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి స్టేషన్గన్పూర్ కృష్ణవేణి, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి రామ్ రెడ్డి, డిపిఓ వసంత, సిపిఓ ఇస్మాయిల్, వినోద్ కుమార్, డి సి ఓ కిరణ్ కుమార్, డీఎస్ఓ రోజా రాణి, ఎంపీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ రజిత, డిఎం సివిల్ సప్లై సంధ్యారాణి, కలెక్టరేట్ పరిపాలన అధికారి మనసూరి జిల్లాలోని అన్ని శాఖ

Share This Post