ప్రజావాణి కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

పత్రికా ప్రకటన.     తేది:30.01.2023, వనపర్తి.

ప్రజావాణి కార్యక్రమం ద్వారా దరఖాస్తుదారుల నుండి అందిన దరఖాస్తులను పరిశీలించి, వెంటనే  పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా జిల్లా అధికారులకు ఆదేశించారు.
సోమవారం ఐ.డి.ఓ.సి. ప్రజావాణి సమావేశ మందిరంలో ఆమె ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తుదారుల ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పెన్షన్ లకు సంబంధించిన దరఖాస్తులు (06), ఇతర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు (10), మొత్తం (16) దరఖాస్తులను స్వీకరించినట్లు ఆమె తెలిపారు.  దరఖాస్తుదారుల నుండి అందిన దరఖాస్తులను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆమె ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్బాన్, (రెవెన్యూ) డి.వేణుగోపాల్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post