ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను స్వీకరించిన – అదనపు కలెక్టర్ రాజేష్ కుమార్

ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుండి (25) ఫిర్యాదులను స్వీకరించినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో శ్రీనివాసులు, వివిధ శాఖల  జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

Share This Post