ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ బాష

పత్రికా ప్రకటన.          తేది:30.05.2022, వనపర్తి.

ప్రజావాణి కార్యక్రమం ద్వారా లబ్ధిదారుల నుండి స్వీకరించిన ఫిర్యాదులను పెండింగ్ లేకుండా, వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ బాష అధికారులకు ఆదేశించారు.
సోమవారం ఐ.డి. ఓ.సి. ప్రజావాణి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమం ద్వారా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన లబ్ధిదారుల నుండి ఆమె (33) ఫిర్యాదులను స్వీకరించారు. అందిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా లబ్ధిదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, (రెవెన్యూ) డి.వేణుగోపాల్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post