ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఫిర్యాదులను స్వీకరించిన సీనియర్ జిల్లా అధికారి, సి.పి.ఓ. వెంకటరమణ

పత్రికా ప్రకటన.          తేది:06.06.2022, వనపర్తి.

ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని సీనియర్ జిల్లా అధికారి, సి.పి.ఓ. వెంకటరమణ, జిల్లా అధికారులకు సూచించారు.
సోమవారం ఐ.డి. ఓ.సి. ప్రజావాణి సమావేశ మందిరంలో కలెక్టరేట్ ఏ.ఓ. వెంకటకృష్ణతో కలిసి సి.పి.ఓ. ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమం ద్వారా లబ్ధిదారుల నుండి స్వీకరించిన ఫిర్యాదులను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా (39) ఫిర్యాదులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ.ఓ. వెంకట కృష్ణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

 

Share This Post