సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల యొక్క దరఖాస్తులను స్వీకరించి పరిష్కరించేందుకు ఆయా శాఖలకు అధికారులకు ఎండార్స్ చేసినట్లు చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు మాత్రమే హాజరు కావాలని, తన అనుమతి లేకుండా ఆలస్యంగా వచ్చినా, గైర్హాజరయినా ఉపేక్షించనని హెచ్చరించారు. ముందస్తు తన అనుమతి తీసుకున్న తదుపరి మాత్రమే ఇతర సిబ్బందిని ప్రజావాణికి పంపాలని, అనుమతి లేకుండా గైర్హాజరయిన అధికారులకు షోకాస్ నోటీసులు జారీ చేసి వివరణతో తనకు నివేదిక అందచేయాలని డిఆర్వో కు సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు సమస్య పరిష్కారం కోరుతూ అందించిన దరఖాస్తులు కొన్ని::- కొత్తగూడెం పట్టణానికి చెందిన తంగెళ్ల శ్రీనివాస్ మరికొందరు 90 సంవత్సరాలుగా పట్టణ నడిబొడ్డులో నిర్వహించిన శ్రీ రామచంద్ర పాఠశాల ఎంతో మంది నిరు పేద విద్యార్థులు చదువుకున్నారని, అటువంటి పాఠశాల మూతపడుటకు కారణమైన ఆనాటి ప్రధానోపాధ్యాయుని అనేక మంది పేద విద్యార్థులకు టిసిలు ఇచ్చారని, పాఠశాలను తిరిగి ప్రారంభించి పేద విద్యార్థులకు విద్యనందించుటకు చర్యలు చేపట్టాలని చేసిన దరఖాస్తును విచారణ నిర్వహించి తనకు సమగ్ర నివేదిక అందచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ముల్కలపల్లి మండలం, లింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కీసరి రాజమ్మ ముల్కలపల్లి మండల రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 234/2లో ఉన్న 2.15 ఎకరాలు, పొగళ్లపల్లి రెవిన్యూ పరిధిలోని సర్వే నెం: 300/1లో 5 ఎకరాలు ఉన్నదని, తన భర్త మరణించినందున అట్టి భూమిని తన పేరున పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని దరఖాస్తు చేశారు. చుంచుపల్లి మండలం, ధన్ బాద్ ఏరియాకు చెందిన కె. అపర్ణ తను నిర్వహిస్తున్న కిరాణా దుకాణాన్ని ఎటువంటి సమాచారం ఇవ్వకుండ ధ్వసం చేశారని, తద్వారా తాను జీవించడానికి అవకాశం లేకుండా పోయిందని కావున తనకు న్యాయం చేయడంతో పాటు బ్రతుకుదెరువుకు దళితబంధు పథకం కానీ ఎస్సీ కార్పోరేషన్ ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ అపర్ణ వ్యాపారం నిర్వహించడానికి మున్సిపల్ పరిధిలో నిర్మించిన దుకాణాన్ని కేటాయించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. పాల్వంచ మున్సిపల్ పరిధిలోని వార్డు నెం.7 కు చెందిన కొందరు వ్యక్తులు ఖాళీ ఇంటి స్థలాల్లో మురుగునీరు నిల్వ ఉండట వల్ల పరిసరాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని, వ్యాధులకు గురవుతున్నామని తక్షణ చర్యలు చేపట్టాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన ఆయన తక్షణం పరిశభ్రం చేయించాలని, యజమానులకు జరిమాన విధించాలని పాల్వంచ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన కొందరు వ్యక్తులు మండల పరిధిలోని సర్వే నెం. 46లోని ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భూమి అని హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసినా అట్టి బోర్డులను తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ప్రభుత్వ భూమి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తు పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీదేవిపల్లి తహసిల్దార్ భూ పరిరక్షణకు ఫెన్సింగ్ వేయాలని ఆదేశించారు. చుంచుపల్లి మండలం, రాందాస్ తండాకు చెందిన యన్ నాగమణి తాను వికలాంగురాలినని హిందీ పండిట్ పూర్తి చేసిన తనకు ఉపాది అవకాశం కల్పించాలని చేసిన దరఖాస్తును ట్రై కార్ ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఐటిడిఏ ఎస్ ఓ కు సిఫారసు చేశారు. ఈ కార్యక్రమంలో
డిఆర్ఓ అశోకచక్రవర్తి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.