ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలని, గైర్హాజర్ అయితే చర్యలు తప్పవని – జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ హెచ్చరించారు

ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలని, గైర్హాజర్ అయితే చర్యలు తప్పవని – జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ హెచ్చరించారు

ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలని, గైర్హాజర్ అయితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ హెచ్చరించారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల సమస్యల తక్షణ పరిష్కారానికి నిర్ణయాధికారాలు తీసుకునే అధికారం లేని క్రింది స్థాయి అధికారులను, సిబ్బందిని ప్రజావాణికి ఎట్టి పరిస్థితులలో పంపవద్దని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజా నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నతాధికారులకు సమస్యలు విన్నవిస్తే పరిష్కారమవుతాయనే నమ్మకంతో సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, లేకుంటే ప్రాధాన్యత సన్నగిల్లే ప్రమాదముందని అన్నారు. ప్రజావాణికి చాలామంది అధికారులు రాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూతక్షణమే వారికి తాకీదు జారీచేయవలసినదిగా ఆదేశించారు. ఇకముందు అధికారులు అత్యవసరమైతే ముందస్తు అనుమతి తీసుకోవాలని, క్రింది స్థాయి సిబ్బందిని పంపారాదని సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమ ప్రాధాన్యాతనెరిగి అంకితభావంతో పనిచేయాలని, లేకుంటే కార్యక్రమ ప్రాధాన్యత సన్నగిల్లే ప్రమాదముందని హెచ్చరించారు. ఇంతవరకు పెండింగులో ఉన్న దరఖాస్తుల తాజా పరిస్థితిని సమీక్షిస్తూ 52 శాఖాలలో 172 ధరఖాస్తులతో పాటు, రెవిన్యూ డివిజన్ స్థాయిలో 61, మండల తహసీల్ధార్ల స్థాయిలో 152, మండల పరిషద్ స్థాయిలో 115 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయని వీటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిష్కరించుటకు తగు చర్యలు తీసుకోవాలని , కానీ పక్షంలో వారికి సరైన పరిష్కార మార్గం చూపుతూ వివరాలను ప్రజావాణి వెబ్ సైట్ లో అప్ డేట్ చేయాలని అధికారులకు సూచించారు. అప్డేట్ చేయడంలో ఏమైనా ఇబ్బందులుంటే 7337340816 మొబైల్ నెంబరుకు సంప్రదించవలసినదిగా అధికారులకు సూచించారు. ఈ రోజు జరిగిన ప్రజావాణిలో 44 విజ్ఞప్తులు అందాయి . అందులో ప్రధానంగా భూ సమస్యలు, పట్టాదార్ పాస్ పుస్తకాలు, భూ నష్టపరిహారం, తదితర సమస్యలకు సంబంధించి 26 ఫిర్యాదులు రాగా , పింఛన్లకు సంబంధించి 3 విజ్ఞప్తులు, వివిధ అంశాలకు సంబంధించి మరో 15 దరఖాస్తులు రాగా వాటి పరిష్కార నిమిత్తం సంబంధిత శాఖలకు అందజేస్తూ నిర్ణీత కాలవ్యవధిలోగా పరిష్కరించవలసినదిగా కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రజావాణిలో వచ్చిన కొన్ని సమస్యలు ఇలా..
రామాయంపేట మండల కోనాపూర్ లో ఊరచెరువు క్రింద పంట పొలాలకు ప్రధాన కాలువ తీయవలసినదిగా ఆ గ్రామతులు రామచంద్ర రెడ్డి, వెంకటేట్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీను, బీరయ్య మరికొందరు రైతులు విజ్ఞప్తి చేయగా తగు చర్య తీసుకోవలసిందిగా డిఆర్.డి.ఓ. కు సూచించారు.
చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామా శివారులోని 351 సర్వే నెంబర్లో పేద రైతులకు ఇచ్చిన అసైన్డ్ భూమి సమస్య పరిష్కరించి రైతుబంధు వచ్చేలా చూడవలసినదిగా రైతులు విజ్ఞప్తి చేశారు.
హవేలీ ఘనపూర్ మండలం రాజుపేట కు చెందిన లంబాడి గోపమ్మ చనిపోయిన తన భర్త పేరుమీద ఉన్న భూమి పట్టా మార్పు చేయవలసినదిగా విజ్ఞప్తి చేశారు.
చిల్పిచెడ్ మండలం శీలపల్లి గ్రామం లో మ్యాప్ ప్రకారం కాకుండా వేరే మార్గంలో కాళేశ్వరం కాలువకు పెగ్ మార్కింగ్ చేస్తుండడంవల్ల పంట పొలాలు పోతున్నాయని న్యాయం చేయవలసినదిగా జిల్లాల గోపాల్ రెడీ, నిర్మల, పెద్దోళ్ల బాల రెడ్డి అదితరులు వినతి పత్రం ఇచ్చారు.
మెదక్ మండలం నవాబుపేట కు చెందిన గుండు నారాయణ కొత్త పాస్ బుక్ ఇప్పించవలసిందిగా అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేష్, జిల్లా పరిషద్ సీఈఓ శైలేష్, డిఆర్ డివో శ్రీనివాస్, తూప్రాన్ ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్, డి.పి .ఓ. తరుణ్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏ.డి. గంగయ్య, మైన్స్ ఏ.డి. జయరాజ్, పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కృష్ణ మూర్తి, డిఎస్.డి.ఓ. విజయలక్ష్మి, బి.సి.అధికారి కేశూరం, డిఎమ్.అండ్ హెచ్ ఓ వెంకటేశ్వర్ రావు , కలెక్టరేట్ ఏ.ఓ. మన్నన్, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post