ప్రజావాణి కి వచ్చే ప్రతి అర్జీదారులకు రసీదు అందజేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు

ప్రజావాణి కి వచ్చే ప్రతి అర్జీదారులకు రసీదు అందజేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరం నందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన విన్నపాలకు అధికారులు వెంటనే రసీదును అందజేయాలని అర్జీదారులు తమ సమస్య పరిష్కరించే అంతవరకు రసీదును జాగ్రత్తపరుచుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి విన్నపాన్ని పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తాసిల్దార్ లకు భూ లావాదేవీలపై 18 దరఖాస్తులు, వివిధ పెన్షన్లపై డిఆర్డిఓ 4, dsp కోదాడ 1,డబుల్ బేడ్ రూమ్ 09, ఇతర శాఖలకు 8,ఈరోజు జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 40 దరఖాస్తులు స్వీకరించడమైనదని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను పరిష్కరించి సదరు వివరాలను సైతం ఆన్లైన్లో నమోదు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు, కోదాడ,సూర్యాపేట, హూజూర్ నగర్ ఆర్డిఓలు కిషోర్ కుమార్, రాజేంద్ర కుమార్, వెంకారెడ్డి, ఏవో శ్రీదేవి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
–‐——————-‐————————
జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సూర్యాపేట జిల్లా వారిచే జారీ చేయనైనది

Share This Post