ప్రజావాణి కి విశేష స్పందన: జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

* ప్రచురణార్థం *
ములుగు నవంబర్ 08 ( సోమవారం).

ప్రజావాణి లో వివిధ సమస్యలపై ప్రజలు అందించిన దరఖాస్తులపై సత్వర న్యాయం జరిగేలా నిబద్ధతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ సమస్యలపై  ప్రజావాణికి విచ్చేసిన ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ప్రజావాణి కు విశేష స్పందన లభించిందని,ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు సకాలంలో అందేలా చొరవ చూపాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులు అర్హత మేరకు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, సమస్య పరిష్కారం కాని పక్షంలో సమస్య లో ఉన్న  లోటుపాట్లను ప్రజలుకు  వివరించాలని,
ప్రజలకు ప్రజావాణి పై నమ్మకం కలిగేలా చూడాలన్నారు.

ఏటూరునాగారం మండలం రామన్నగూడెం కు చెందిన చెరువు శిఖరం కొందరు రైతులు ఆక్రమించి నందున వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు సమర్పించారు.  గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామం నివాసి వీరమల్లు ఉప్పలయ్య తనకు సంబంధించిన సర్వే నెంబర్ 816 లో ఎకరం భూమి కలదని నిబంధనలు అతిక్రమించి వేరొకరు పట్టా చేయించుకున్నారని వారిపై చర్య తీసుకోవాలని దరఖాస్తు సమర్పించారు. ముత్తినేని అనూష జగ్గంపేట గ్రామం ఆశ్రమ జూనియర్ కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ కొరకు దరఖాస్తులు సమర్పించారు. పి. ముత్యాలరావు కేశవాపూర్ గ్రామం తనకు సంబంధించిన భూమి సర్వే నంబర్ మిస్సింగ్ గురించి దరఖాస్తు సమర్పించారు ప్రజలు అందించిన దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల మేరకు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా అధికారులు , కలెక్టర్ కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post