ప్రజావాణి, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు తీసుకున్న చర్యలపై నివేదికలు అందచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు

. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో డయల్: యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి ఫోన్ ద్వారా ప్రజలు తెలియచేసిన సమస్యలను నమోదు చేసుకున్నట్లు చెప్పారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా కొద్ది మంది అధికారులు మాత్రమే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి హాజరయ్యారని, వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించుటకు సిఫారసు చేస్తున్నట్లు ఆయన వివరించారు. గత సంవత్సరం జూన్ మాసం నుండి ఈ రోజు నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం వరకు సమస్య పరిష్కారానికి ప్రజలు అందచేసిన పిర్యాదులపై తీసుకున్న చర్యల నివేదికలు అందచేయాలని, ఈ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ రోజు నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 52 పిర్యాదులొచ్చాయని చెప్పారు. సమస్య పరిష్కారం కోరుతూ డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులు కొన్ని అశ్వారావుపేట మండలం, నారంవారిగూడెం గ్రామానికి చెందిన వెంకప్ప సర్వే నెం. 512లో ఉన్న తన భూమికి ఇతరులు పట్టా జారీ చేశారని, అట్టి భూమికి అనుభవదారుడిగా తానే ఉన్నానని కావున విచారణ నిర్వహించి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చేసిన ఫిర్యాదుపై కలెక్టర్ స్పందిస్తూ టైటిల్ డిస్పూట్ కాబట్టి సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచించారు. అన్నపురెడ్డిపల్లి మండలం, పెద్దిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన శ్రీధర్ తమ గ్రామానికి మిషన్ బగీరధ మంచినీరు సరఫరా చేయడం లేదని, ఇళ్లకు నీటి సరఫరాకు కుళాయిలు సైతం ఏర్పాటు చేయలేదని, గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని పిర్యాదు చేయగా మిషన్ బగీరథ ఇంజనీరింగ్ అధికారులు గ్రామంలో పర్యటించి సమస్యను పరిష్కరించు విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. శంభునిగూడెం గ్రామ పంచాయతీకి చెందిన రాంప్రసాద్ తమ గ్రామంలో 2017 రహదారి నిర్మాణం పనులు చేపట్టారని. పనులు వేగవంతం చేయాలని పిర్యాదు చేయగా తక్షణం పూర్తి చేయు విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. పాత పాల్వంచకు చెందిన బాలయ్య సర్వే నెం. 213 లో ఉన్న భూమిలో సాగుదారుడిగా ఉన్నానని, అట్టి భూమికి ఇతరుల పేరు చూపిస్తున్నదని, విచారణ నిర్వహించి పట్టాదారు పుస్తకం మంజూరు చేపించాలని కోరగా తహసిల్దార్ ద్వారా విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆళ్లపల్లి మండలం నుండి ముత్యమాచారి మొద్దుల చెరువుకు గైడ్ వాల్ నిర్మించాలని, గైడ్ వాల్ లేకపోవడం వల్ల పొలాలపైకి నీరు వస్తున్నదని, సాగు చేయడానికి రైతులు ఇబ్బంది పడుతున్నామని చెప్పగా ఇరిగేషన్ అధికారులు ద్వారా అంచనా నివేదికలు తయారు చేపించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దమ్మపేట మండలం, నాగుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరావు సర్వే నెం. 9/1/2లో ఉన్న భూమి చెరువుకు దూరంగా ఉన్నదని, అధికారులు చెరువు శిఖంగా చూపిస్తున్నారని పరిశీలన చేపించి న్యాయం చేయాలని పిర్యాదు చేయగా ఆర్టీఓ క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు అందచేయాలని సూచించారు. దుమ్ముగూడెం మండలం, సీతానగరం గ్రామానికి చెందిన సకలం భూషమ్మ సర్వే నెం. 7/7లో తనకు 8 సెంట్లు భూమి ఉన్నదని, సీతారామ బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూమి తీసుకున్నారని, కానీ 4 సెంట్లుకు మాత్రమే పరిహారం అందించారని, మిగిలిన 4 సెంట్లుకు పరిహారం అందించు విధంగా చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేయగా భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆధారాలతో దరఖాస్తు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీ అశోక్ చక్రవర్తి, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, వైద్యాధికారి డాక్టర్ శిరీష, సంక్షేమ అధికారి వరలక్ష్మి, ఎస్సీ కార్పోరేషన్ ఈడి ముత్యం, ఆర్డీఓ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు

Share This Post