ప్రజావాణి దరకాస్తుల స్వీకరణ

వార్త ప్రచురణ
తేదీ.20.12.2021.(సోమవారం)
ములుగు జిల్లా( మంగపేట)

జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజల ప్రయోజనాల నిమిత్తం జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు మంగపేట రైతు వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్వో రమాదేవి పాల్గొని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగపేట రైతువేదికలో ప్రజావాణి నిర్వహించడం వలన ప్రజల నుండి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని, సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసి సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికారులకు సూచించారు.

గత ప్రజా వాణి లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు మొత్తం 3950 రాగా,ఇందులో 2812 పరిష్కరించ గా ఇంకాను పెండిగ్లో 1015 ఉన్నాయని ,123 దరఖాస్తు లను ఇతర శాఖలకు ఫార్వర్డ్ చేయడం జరిగింది.దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్ లో ఉన్నవి తసిల్దార్ ములుగు లో 386, వెంకటాపూర్ లో 220 పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిశీలించి పరిష్కరించే దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని, పరిష్కరించ లేని దరఖాస్తులను ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి దరఖాస్తుదారునికి తెలియపరిచే విధంగా సమాచారం అందించాలని డి ఆర్వో రమాదేవి అన్నారు. ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులదని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.

సోమవారం రోజు వచ్చిన దరఖాస్తులను ఈ వారం లోపు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సోమవారంరోజు వచ్చిన దరఖాస్తులు 70 రాగా అందులో భూ సంబంధిత, బెల్ట్ షాపులు నియంత్రించాలని పలు సమస్యల పై దరఖాస్తులు వచ్చాయాని గత వారం ఐటిడిఏ లో ప్రజావాణి నిర్వహించామని, ఈ వారం మంగపేట రైతు వేదికలో నిర్వహించడం జరిగిందని డి ఆర్వో అన్నారు.

ప్రజావాణి లోఎక్సైజ్ శాఖకు సంబందించిన దరఖాస్తు లు రాగా సంబంధిత శాఖ అధికారుల కు ఇస్తూ విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని డి ఆర్వో రమాదేవి ఆదేశించారు .

ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువతి యువకులు TS- iPASS ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని ఈ సందర్భంగా వారు అన్నారు.

ఈ సందర్భంగా ఐటిడిఏ ఏపివో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు ప్రజావాణి దరఖాస్తు పరిష్కరిస్తూనే శాఖ పరమైన పనులు పెండింగ్లో లేకుండా చూడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో SDC శ్రీరాములు, డి ఆర్ డి వో నాగపద్మజా, ఎస్సీ కార్పొరేషన్ ఈడి రవి, ఆర్ అండ్ బి. ఇఇ వెంకట్, జిల్లా వెటర్నరీ అధికారి విజయ్ భాస్కర్, ఐ సి డి ఎస్ అధికారిణి ప్రేమలత, ఎస్సి వెల్ఫేర్ ఆఫీసర్ పి భాగ్యలక్ష్మి, డి యం &హెచ్ ఓ అప్పయ్య, సంబంధిత జిల్లా అధికారులు ఐటీడీఏ యూనిట్ అధికారులు పాల్గొన్నారు.

Share This Post