ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలి: జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖిమ్యా నాయక్

*ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలి : జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్*

——————————

ప్రజావాణిలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, వాటికి సత్వర పరిష్కారం చూపే దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ ఆదేశించారు.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలకు పరిష్కారం చూపేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్ అర్జీలపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అన్నారు. ప్రజావాణిలో భూ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే ఫిర్యాదులు, వినతులపై
రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు.

కాగా సోమవారం భూ సంబంధిత సమస్యలు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 19 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి.
ప్రజావాణి లో ఇంఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి టి.శ్రీనివాస రావు, వేములవాడ ఆర్డీఓ వి.లీల, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

( Attached: శాఖ వారీగా ఫిర్యాదులు, వినతుల జాబితా)
Revenue-8
MPDO Yellareddypet-1
DCSO-1
MC Sircilla-3
Mc Vemulawada-1
Survey-1
DPO-3
Employment-1

Total – 19
—————————————–

Share This Post