ప్రజావాణి దరఖాస్తులను అధికారులు వెంటనే పరిష్కారం చేయాలి :: జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రజావాణి దరఖాస్తులను అధికారులు వెంటనే  పరిష్కారం చేయాలి :: జిల్లా కలెక్టర్ కె.శశాంక

ప్రచురణార్థం

మహబూబాబాద్, మార్చి :20.
ప్రజల నుండి ప్రజావాణి లో వచ్చే ధరఖాస్తులను అధికారులు త్వరగా పరిష్కారించాలని అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.

సోమవారం కలెక్టరేట్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె.శశాంక అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అభిలాష అభినవ్, ట్రైనీ కలెక్టర్ పింకేశ్వర్ తో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు గ్రీవిన్స్ లో వచ్చిన దరఖాస్తులను ( 70 ) త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి లో ( 70 ) దరఖాస్తులను కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులకు తగు చర్యలకై పరిష్కారం కొరకు ఆదేశించారు.

ఈ సందర్భంగా బయ్యారం మండలం బాలాజీ పేట గ్రామంలోని ప్రకాష్ నగర్ తండా వాసులు తమ తాండాలోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్ లేక గర్భిణీ స్త్రీలు,బాలింతలు, చిన్న పిల్లలకు చదువు చెప్పేవారు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంగన్వాడీ కి టీచర్ ను కేటాయించి గర్భిణీ స్త్రీల సమస్యలు, చిన్న పిల్లల చదువులకు సహకారాన్ని అందించాలని కోరారు.

మహబూబాబాద్ పట్టణంలో 25వ వార్డు నందమూరి నగర్ కాలనీ కి చెందిన మచ్చ సునిత తను పది సంవత్సరాలుగా అద్దె ఇంటిలో నివసిస్తు కుట్టు మిషన్ తో బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నానని తన భర్త దినసరి కూలీ అని గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లకోసం దరఖాస్తు చేసుకొనగా స్థానిక తహసీల్దార్ విచారణకు వచ్చి మా యొక్క స్థితిని పరిశీలించారని, దయతో తమకు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చేలా తగు న్యాయం చేయాలని కోరారు.

పట్టణంలో 200 మంది దళిత కుటుంబాలకు చెందిన ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్దతిలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్నామని కోవిడ్-19 వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పట్టణ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచామని,పేద పారిశుద్ధ్య కార్మికులమైన తమకు ఇంటి స్థలాలను కేటాయించి న్యాయం చేయాలని కోరారు.

పెద్డవంగర మండలం పోచారం గ్రామానికి చెందిన కాలేరు మల్లయ్య ఫిబ్రవరి లో తన కూతురి వివాహం చేశానని మీ సేవాలో కళ్యాణ లక్ష్మీ పథకానికి దరఖాస్తు చేసుకోగా కొన్ని కారణాల వలన దరఖాస్తు ను అంగీకరించుట లేదని కళ్యాణ లక్ష్మీ పథకానికి నా యొక్క దరఖాస్తును అంగీకరించే విధంగా తనకు న్యాయం చేయాలని కోరారు.

నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామానికి చెందిన రూపిరెడ్డి దిలీప్ రెడ్డి గ్రీన్ ఫీల్డ్ హై వే రోడ్డులో తన వ్యవసాయ భూమిలో ఉన్న పివిసి వైపు లైను నష్టం జరుగుతుందని తన పైపు లైనును సర్వే చేసి నష్టానికి పరిహారం ఇప్పించేందుకు న్యాయం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత ప్రజావాణికి విచ్చేసి జిల్లా కలెక్టర్ తో తన దృష్టికి వచ్చిన జిల్లాలోని కొంతమంది రైతుల భూ సమస్యలను అ దేవిధంగా కురవి దేవాలయ భూములు ఆక్రమణకు గురి కాకుండా సర్వే చేసి చర్యలు చేపట్టాలన్నారు. స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎం.పి వెంట ప్రజాప్రతినిధులు,ప్రజలు ఉన్నారు.

ఈ ప్రజావాణి లో జిల్లా అధికారులు, ప్రజలు తది తరులు పాల్గొన్నారు.

Share This Post