ప్రెస్ రిలీజ్
జనగామ జిల్లా. నవంబర్ – 28
ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారి నుండి దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సోమవారం నాడు ప్రజావాణిలో (70) దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా వచ్చిన వినతులను దరఖాస్తులను పరిశీలించి వెంటనే తగు చర్యలు తీసుకొని పరిష్కరించాలన్నారు అట్టి సమాచారాన్ని దరఖాస్తుదారులకు వివరంగా తెలియపరచాలన్నారు. ప్రజావాణి ద్వారా మరింత వేగంగా సేవలు అందించాలని సంబంధిత సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజావాణి ఉంటుందని ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు మధుమోహన్, కృష్ణవేణి, డిఆర్డిఓ ప్రాజెక్టు డైరెక్టర్ జి .రామిరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి మన్సూర్ ఆలీ, జిల్లా అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.