పత్రిక ప్రకటన
తేది: 23-01-2023
ధరణి పై వచ్చిన 100 దరఖాస్తుల తక్షణ పరిష్కారం
నాగర్ కర్నూల్ జిల్లా.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ శాఖల సమస్యల పరిష్కారం పై వచ్చిన 27 ఫిర్యాదులను కలెక్టర్ ఉదయ్ కుమార్ స్వీకరించారు.
ఫిర్యాదును స్వీకరించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ధరణి సమస్యలపై వచ్చిన 100 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ అప్పటికప్పుడే దరఖాస్తుదారుని ముందరే కంప్యూటర్లో నేరుగా పరిష్కరించారు.
ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలన్నారు.
ప్రజావాణిలో డిఆర్డిఏ పిడి నర్సింగరావు,కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
———————–
జిల్లా పౌర సంబంధాల అధికారి, నాగర్ కర్నూలు ద్వారా జారీ.