ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ.

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ.

ప్రచురణార్థం

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ.

పెద్దపల్లి, అక్టోబర్ -17:

ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు.

సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్లు వి.లక్ష్మినారాయణ, కుమార్ దీపక్ లతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.

ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో తిరస్కరణకు గల కారణాలను వివరంగా తెలుపుతూ అర్జిదారునికి అందజేయాలని సూచించారు.

ఈ రోజు మొత్తం (33) దరఖాస్తులు రాగా, పెన్షన్ మంజూరు కోరుతూ, ఉపాధి కల్పించాలని, భూ సంభందిత సమస్యలపై ఎక్కువగా అర్జీలు వచ్చాయి.

పెద్దపల్లి రాంపల్లి కి చెందిన వరినేని సుగుణమ్మ 1993లో తన భర్త చనిపోయారని, తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.

రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జే. ఎర్రమ్మ తన భర్త అనారోగ్య కారణాలతో చనిపోయారని, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వపరంగా పెన్షన్ మంజూరు చేయుటకు కోరారు.

శ్రీరాంపూర్ మండలం ఎదులపురం గ్రామానికి చెందిన చేగొండ కిష్టయ్య సర్వే నంబర్ 129లో వారసత్వంగా వచ్చిన 30 గుంటల భూమిలో 26 గుంటల భూమిని కాల్వ క్రింద తీసుకోగా, అవార్డ్ కాపీలో 13 గంటలు నమోదు అయినందున, ఆన్లైన్ లో అదనంగా తొలగించిన 13 గుంటల భూమిని తన పేరున నమోదు చేయాలని కోరారు.

రామగుండం 5వ డివిజన్ వాస్తవ్యులు తమ ప్రాంతంలో ఉన్న రోడ్లు గుంతలమయమైనందున వాటిని మరమ్మతులు చేయించుటకు కోరారు.

ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయము, పెద్దపల్లి చే జారీ చేయనైనది.

Share This Post