ప్రజావాణి దరఖాస్తులు వెంట వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ప్రచురణార్థం

ఖమ్మం, ఆగస్టు 8:

ప్రజావాణి దరఖాస్తులు వెంట వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి, సంబంధిత అధికారులకు పరిష్కారానికి ఆదేశాలిస్తూ, దరఖాస్తులను ఫార్వార్డ్ చేశారు. ఈ సందర్భంగా పాలేరు గ్రామస్థులు డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరు కొరకు దరఖాస్తు చేయగా, కలెక్టర్ చర్యలకై తహశీల్దార్ ను ఆదేశించారు. రఘునాధపాలెం మండలం వి. వెంకటాయలాలెం కు చెందిన వెంపటి రాధాకృష్ణ పారిశుద్ధ్య నిర్వహణ, నీరు నిల్వకుండా చేయడం, ఇంకుడుగుంతల ఏర్పాటుకు కోరగా, కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారిని చర్యలకై తెలిపారు. బల్లెపల్లి నుండి ఎస్కె. అబ్బాస్ బేగ్ ఖబరస్థాన్ ఏర్పాటుకు కోరగా, తహసీల్దార్, పంచాయతీ అధికారులకు చర్యలకై కలెక్టర్ తెలిపారు. రోటరీనగర్, ఖానాపురం హవేలి కి చెందిన బయ్యని సువర్ణ డబుల్ బెడ్ రూం మంజూరు కొరకు దరఖాస్తు చేయగా, చర్యలకై కలెక్టర్ ఆదేశించారు. ముస్తఫానగర్ నుండి వి. మోహనకృష్ణ, తాను వికలాంగుడినని అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించగలందులకు దరఖాస్తు సమర్పించగా చర్యలకై కలెక్టర్ ఆదేశించారు. పెనుబల్లి మండలం అడవిమల్లెల గ్రామం నుండి జొన్నలగడ్డ నాగేశ్వరరావు, తనకు సర్వే నెం. 128 లో 1.12 గుంటల భూమికి పాస్ బుక్ ఉన్నట్లు, ఆన్లైన్ పహాని రావడం లేదని దరఖాస్తు ద్వారా కోరగా, తహసీల్దార్ కు తగుచర్యలకై కలెక్టర్ ఆదేశించారు. రఘునాధపాలెం మండలం వివి పాలెం అంగన్వాడీ ఆయా, తనకీ వచ్చే వితంతు పింఛను నిలుపుదల చేశారని, తిరిగి మంజూరుకు కోరగా, డీఆర్డీవో కు చర్యలకై కలెక్టర్ తెలిపారు. చినమునగాల గ్రామం కొనిజర్ల మండలం నుండి లక్ష్మి కళ్యాణలక్ష్మి పధకం డబ్బుల మంజూరుకు కోరగా, ఆర్డీవో కు చర్యలకై కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా అధికారులతో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల. నిర్వహణపై కలెక్టర్ సూచనలు చేశారు. 2 వారాలు నిర్వహించే వేడుకల షెడ్యూల్ ఆందజేసినట్లు, అన్ని కార్యక్రమల్లో అధికారులు, సిబ్బంది అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. సమన్వయంతో వేడుకలను విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మొగిలి స్నేహాలత, ఎన్. మధుసూదన్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post