ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం కోసం తీసుకున్న చర్యల నివేదికలను ప్రతి శుక్రవారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ముజామిల్ ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు


పత్రికా ప్రకటన
సిద్దిపేట మే 2 సోమవారం.

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం కోసం తీసుకున్న చర్యల నివేదికలను ప్రతి శుక్రవారం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ముజామిల్ ఖాన్ జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డితో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ ప్రజల నుండి సమస్యల పరిష్కారం కోసం అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ముజామిల్ ఖాన్ మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రజావాణి కార్యక్రమానికి వస్తారు కాబట్టి ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు అందరూ పాల్గొంటే నేరుగా సమస్యలను ఆయా శాఖల అధికారులు పరిశీలించి త్వరగా పరిష్కరించే అవకాశం ఉంది కాబట్టి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పకుండా ప్రజావాణి కార్యక్రమానికి హాజరై అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తీసుకున్న చర్యల నివేదికను ప్రతి శుక్రవారం అందించాలని అన్నారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి(36) దరఖాస్తులు వచ్చాయి.

జిల్లా వ్యాప్తంగా నిర్ణయించిన అన్ని ప్రాంతాలలో రెండు రోజుల్లోగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రైతుల సౌకర్యార్థం నిర్మించిన రైతు వేదికలు దాదాపు ప్రారంభించడం జరిగిందని ఎక్కడైనా ఇంకా ప్రారంభం కాకుండా పెండింగ్లో ఉంటే వెంటనే ఆయా రైతు వేదికలలో త్రాగునీరు, మరుగుదొడ్డి, విద్యుత్తు తదితర సౌకర్యాలు కల్పించి గ్రామపంచాయతీ సహకారంతో శుభ్రపరిచి శుక్రవారంలోగా ప్రారంభించాలని ఆదేశించారు.

తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినందున వర్షాకాలంలో మొక్కలు నాటుటకు ఇప్పుడే లొకేషన్స్ ను గుర్తించాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి రోడ్లకు ఇరువైపులా, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలు, ప్రభుత్వ సంస్థల ఖాళీ స్థలాలను గుర్తించి ఎంపీడీవోలు తదితర అధికారుల సహకారంతో మొక్కలు నాటడానికి చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం అధిక ఎండల మూలంగా మొక్కలు చనిపోకుండా క్రమంగా నీరు అందించాలని అన్నారు.

ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం అనుకున్నంత వేగంగా జరగడం లేదని ఎంపిక చేసిన పాఠశాలల్లో అవసరమైన పనులను గుర్తించి త్వరగా అనుమతులు పొంది పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేలా పనులను పూర్తి చేసి పాఠశాలలను సుందరంగా తీర్చి దిద్దాలని అన్నారు.

జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని కేంద్రాలకు అవసరమైన సౌకర్యాలను కల్పించడం జరిగిందని వెంటనే దాన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, మిల్లర్లు ధాన్యాన్ని తీసుకోకుండా ఇబ్బంది పెడితే తెలియజేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చెన్నయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట వారి జారీ చేయడమైనది.

Share This Post