ప్రజావాణి ద్వారా వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రికా ప్రకటన                                                         తేది: 22-11-2021

ప్రజావాణి ద్వారా వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా అధికారుల సమక్షం లో ఏర్పాటు చేసిన ప్రజావాణి లో వివిధ ప్రాంతాల నుండి  వచ్చిన ప్రజల నుండి  ధరఖాస్తులను స్వీకరించారు.

ప్రజావాణి లో మొత్తం 50 దరఖాస్తులు వచ్చాయని, పిర్యాదులు ఎక్కువగా ఆసరా పెన్షన్లకు  సంబందించినవి, భూ సమస్యలు, కుటుంబ సమస్యలు, మున్సిపాలిటీకి సంబంధించిన పిర్యాదులు  వచ్చాయని, వాటిని సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారమయ్యేలా చూస్తామని పిర్యాదుదారులకు హామీ ఇచ్చారు.

సమావేశం లో అదనపు కలెక్టర్లు, రఘురాం శర్మ, శ్రీ హర్ష, ఆర్.డి.ఓ రాములు , జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

————————————————————————————

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల  గారి చే జారీ చేయడమైనది.

Share This Post