మంగళవారం నాడు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవిన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లతో ప్రజావాణి ఫిర్యాదులు, ధరణి పెండింగ్ దరఖాస్తులను సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజావాణి ద్వారా 227 పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయని, వాటిని సత్వరంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధరణి సంబంధించి ఆధార్ సీడింగ్, మ్యుటేషన్స్, పిఓబి, పిపిబి, జిపిఏ తదితర అంశాలకు సంబంధించి 921 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని, ప్రణాళికాబద్దంగా దరఖాస్తులను పరిష్కరించాలని, అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
సమీక్షలో జిల్లా రెవెన్యూ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారులు భూపాల్ రెడ్డి సూరజ్ కుమార్, కలెక్టరేట్ ఏ.ఓ. నాగేశ్వర చారి, తహసీల్దార్లు పాల్గొన్నారు.
