పత్రిక ప్రకటన తేది : 25.04.2022.
ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ హర్ష అధికారులకు ఆదేశించారు.
సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హలు నందు జిల్లా అధికారులతో కన్వర్జెన్సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా స్వీకరించిన పిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. , పెండింగ్ లో ఉన్న పిర్యాదులను వివిధ శాఖల అధికారులు పిర్యాదుల పరిష్కారం లో నిర్లక్ష్యం చేయకుండా వారి పరిధిలో ఉన్న పిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
అనంతరం వివిధ సమస్యల పై పిర్యాదులను సమర్పించడానికి వచ్చిన ప్రజల నుండి పిర్యాదులను స్వీకరించారు. ఈరోజు నిర్వహించిన ప్రజావాణి ద్వారా మొత్తం 27 పిర్యాదులు వచ్చాయని, 12 పిర్యాదులు భూ సమస్యలకు సంబంధించినవి కాగా 15 పిర్యాదులు ఇతర సమస్యలకు సంబంధించినవి వచ్చాయని తెలిపారు. ప్రజావాణి ద్వారా స్వీకరించిన భూ సమస్యలు , ఆసరా పెన్షన్ మరియు ఇతర సమస్యలకు సంబంధించిన పిర్యాదులు అన్నింటిని సంబంధిత శాఖలకు పంపించి, వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపడతామని పిర్యాదుదారులకు హామీ ఇచ్చారు.
సమావేశం లో జిల్లా అధికారులు, ఎ.ఓ ఆజం అలీ, తదితరులు పాల్గొన్నారు.—————————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి, జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారీ చేయబడినది.