ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదులను పరిష్కరించేలా చర్యలు చేపడతామని జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యల పై పిర్యాదులను సమర్పించడానికి వచ్చిన ప్రజల నుండి జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు పిర్యాదులను స్వీకరించారు.
ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి ద్వారా 40 పిర్యాదులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణి ద్వారా స్వీకరించిన వివిధ సమస్యలకు సంబంధించిన పిర్యాదులు అన్నింటిని సంబంధిత శాఖలకు పంపించి, వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపడతామని పిర్యాదుదారులకు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.