ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్  కుమార్  అధికారులను ఆదేశించారు.  సోమవారం ఉదయమ కలెక్టరేట్ లోని ప్రజావాణి హాలులో అదనపు కలెక్టర్ మను చౌదరి, పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు.  ఫిర్యాదుల సత్వర పరిష్కారానికై ప్రజావాణి హాలు నుండి అన్ని మండలాల తహసిల్దార్లు అక్కడ నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాలను  వెబ్ క్యాస్టింగ్ ద్వార పర్యవేక్షించారు. ఈరొజు ప్రజావాణి లో మొత్తం 39 ఫిర్యాదులు వచ్చినట్లు  తెలిపారు.  మండలానికి సంబంధించిన ఫిర్యాదులు వచ్చినప్పుడు వెంటనే వెబ్ ద్వారా సంబంధిత మండల తహసిల్దార్ తో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.  ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, అదేవిధంగా  దరఖాస్తు దారుకు తగిన  సమాచారం ఇవ్వాలని సూచించారు.  అందరు ప్రత్యెక అధికారులు, జిల్లా అధికారులు వారంలో కనీసం 3 మండలాల్లో పర్యటించాలని, ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించి తమ పరిశీలనలో వచ్చిన అంశాలతో ప్రతి వారం నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.  అధిఆరులు పర్యటన వివరాలతో టూర్ డైరీ వారాంతంలో తనకు పంపవలసిందిగా ఆదేశించారు. 

Share This Post