ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్
ఎస్. వెంకటరావు ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి పీర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజలు సమర్పించిన ఫిర్యాదులపై సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ ప్రజావాణి ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, మండల, గ్రామస్థాయిలో కూడా ప్రజావాణి ఫిర్యాదులు ఎప్పటికప్పుడే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
కాగా ఈ సోమవారం 126 మంది ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను సమర్పించగా, వీటిలో వ్యక్తిగత సమస్యలు, భూమికి సంబంధించిన విషయాలు, పెన్షన్లు, ఉద్యోగం, ఉపాధి కల్పన వంటి అంశాలపై ఎక్కువగా ఉన్నాయి.
అంతకు ముందు జిల్లా కలెక్టర్ బయోమెట్రిక్ అటెండెన్స్ వేయడమే కాకుండా, స్థానిక సంస్థల తేజస్ నందలాల్ పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్
కె .సీతారామారావు, జిల్లా అధికారులకు బయోమెట్రిక్ అటెండెన్స్ గుర్తింపు కార్డులను అందజేశారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,రెవెన్యూ కలెక్టర్
కె .సీతారామరావు, జెడ్పి సీఈవో జ్యోతి, డిఆర్డిఓ యాదయ్య ,ఆర్డిఓ అనిల్ కుమార్, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.