ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రవినాయక్ అన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా కొన్ని ఫిర్యాదులను మండల తహసిల్దారులు, ఎంపీడీవోలతో మాట్లాడుతూ సంబంధిత ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా జిల్లా అధికారుల ద్వారా పరిష్కారమయ్యే ఫిర్యాదులపై కూడా ఆయా జిల్లా అధికారులను తన దగ్గరకు పిలిపించుకొని ఫిర్యాదుదారు ఎదురుగానే వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
కాగా ఈ సోమవారం సుమారు 50 మంది ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను సమర్పించారు.
ఈ ఫిర్యాదులలో భూ సంబంధిత సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, ఉద్యోగ, ఉపాధి కల్పనకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి.
స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ ,ఆర్డీవో అనిల్ కుమార్, డిఆర్డిఓ యాదయ్య, జెడ్పిసిఈఓ జ్యోతి ,జిల్లా అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు .