*ప్రజావాణి ధరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి…జిల్లా కలెక్టర్ బి.గోపి*
జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా సోమవారం రోజున నిర్వహించే ప్రజావాణి
కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి గారు పాల్గొని ప్రజల సమస్యల పైన వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కి ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులు (71) వచ్చాయని, వాటిని సత్వరమే పరిష్కరించాలని,పరిష్కరించుటకు వీలు లేని దరఖాస్తులను అందుకు గల కారణాలతో సంబంధిత దరఖాస్తు దారునకు వివరించే ప్రయత్నం చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
ప్రజావాణి కి వివిధ శాఖల కు సంబందించిన దరఖాస్తులు రాగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ త్వరితగతిన పరిష్కరించుటకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరులో అధికారులు జవాబుదారీతనం కనబరచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు
ఈ కార్యక్రమంలో అదరపు కలెక్టర్ లోకల్ బాడీస్ అశ్విని తానాజీ వాకాడే, అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీవత్సవ కోట, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు